Ex - MINiSTER: భూముల రక్షణ కోసమే రీసర్వే
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:41 PM
రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగారెడ్డి పల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
కొత్తచెరువు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగారెడ్డి పల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడ చూసి నా ఆస్తి సమస్యల పైనే ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తు న్నాయన్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపేం దుకే ప్రభుత్వం రీ సర్వేను చేపట్టిందన్నారు. రైతులు సహకరించాలని ఆయన సూచించా రు. కార్యక్రమంలో ఇనచార్జ్ తహసీల్దార్ బాలాంజనేయులు, వీఆర్‌ఓ ఓబుళేశు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, హరిప్రసాద్, ఒలిపిశీన, బండ్లపల్లిరాజు, లోచర్ల పెద్దన్న, రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....