MLA: టీడీపీ అభ్యున్నతిలో కార్యకర్తలే హీరోలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:56 PM
తెలుగుదేశంపార్టీ అ భ్యున్నతికి కార్యకర్తలే నిజమైన హీరోలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్యెల్యే క్యాం పు కార్యాలయంలో శుక్ర వారం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఉత్తమ కార్య కర్తలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి , మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి రూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ అ భ్యున్నతికి కార్యకర్తలే నిజమైన హీరోలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్యెల్యే క్యాం పు కార్యాలయంలో శుక్ర వారం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఉత్తమ కార్య కర్తలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ప్రభు త్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు జయచంద్ర, గోపాల్‌రెడ్డి, మైలే శంకర్, రామకృష్ణ, సహకార సొసైటీ అద్యక్షుడు శ్రీరామ్‌రెడ్డి, నా యకులు ఎల్‌ఐసీ నరసింహులు, సామకోటి ఆదినారా యణ,, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
ప్రజల ఆర్జీలపై నిర్లక్ష్యం వద్దు
ప్రజాదర్బార్‌లో ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికా రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. టీడీపీ మండల కన్వీనర్లు, కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత సహాయకుడికి పరామర్శ
రోడ్డుప్రమాదంలో గాయపడి స్థానిక సూపరెస్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి పల్లె రఘనాధరెడ్డి వ్యక్తిగత సహాయకుడు లోకేష్‌నాయుడును ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అనం తపురంలో జరిగిన ప్రమాదంలో కాలికి తీవ్రగాయం కావడంతో లోకేష్‌నాయుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....