CRMTs : సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:49 PM
సీఆర్‌ఎంటీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆ యూనియన నాయకులు శని వారం ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు ఎమ్మెల్సీని శనివారం అనంతపురంలో కలిసి వినతి పత్రం అందజేసి నట్లు ఆ యూనియన నాయకుడు రమణ తెలిపారు.
ఎమ్మెల్సీకి సీఆర్‌ఎంటీల వినతి
బత్తలపల్లి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సీఆర్‌ఎంటీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆ యూనియన నాయకులు శని వారం ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు ఎమ్మెల్సీని శనివారం అనంతపురంలో కలిసి వినతి పత్రం అందజేసి నట్లు ఆ యూనియన నాయకుడు రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమగ్ర శిక్షలో పని చేసే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల సమస్యలను ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి దృష్టి కి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. యూనియన నాయకులు నరసింహమూర్తి, నాగభూషణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....