Share News

MLA: లాభసాటి వ్యవసాయమే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:38 PM

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. మండలకేంద్రంలో చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్మించిన కలెక్షన సెంటర్‌, కోల్డు స్టోరేజీని ఆయన శనివారం ప్రారంభించారు.

MLA: లాభసాటి వ్యవసాయమే ధ్యేయం: ఎమ్మెల్యే
MLA Kandikunta speaking at a meeting in Tanakallu

తనకల్లు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. మండలకేంద్రంలో చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్మించిన కలెక్షన సెంటర్‌, కోల్డు స్టోరేజీని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రూ.17లక్షలతో నిర్మించిన కలెక్షన సెంటర్‌, రూ.13లక్షల వ్యయంతో నిర్మించిన కోల్డు స్టోరేజీని 18వందల మంది మహిళ రైతులు ఉపయోగించుకుని, లబ్ధిపొందాలని సూచించారు. మ హిళ సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 1999లోనే శ్రీకారం చుట్టారని అన్నారు. అనాటి డ్వాక్రా గ్రూపులు నేడు మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కంపెనీలుగా అభివృద్ధి చెందడానికి నా టి టీడీపీ ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉందన్నారు.


ముఖ్యంగా మండలంలో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారని, ఆ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా రైతు ఉత్పత్తి దారుల సంఘా లు, కంపెనీలు పనిచేయాలని సూచించారు. రైతులందరూ సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల ప్రోత్సహాకాల ద్వారా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ అధ్యక్షురాలు తోట సరోజమ్మ, టీడీపీ మండల కన్వీనర్‌ రెడ్డి శేఖర్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దుల క్రిష్ణమూర్తి, మహిళ నాయకురా లు శోభ, సర్పంచ కాంతమ్మ, రవీంద్రారెడ్డి, మునియప్ప, బాగేపల్లి చలపతి, గోవిందు, రవి, పీజీ మల్లికార్జున, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్‌ షాబుద్దీన, ఎంపీడీఓ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

కదిరి అర్బన: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కదిరి బ్రాహ్మణపల్లిలో రూ. 28 లక్షలతో నిర్మించనున్న ఆయుష్మాన ఆరోగ్యమందిర్‌ కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. డిప్యూటీ డీఎంఎచఓ డాక్టర్‌ నాగేంద్రనాయక్‌, ఎంపీడీఓ పోలప్ప, స్వచ్ఛాంధ్ర మిషన డైరెక్టర్‌ పర్వీన బాను, టీడీపీ నాయకులు కృష్ణమోహన నాయుడు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 03 , 2026 | 11:38 PM