GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:03 AM
సత్యసాయి గిరి ప్రదక్షిణను శుక్రవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సంద ర్భంగా రాత్రి 7.00 గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.
పుట్టపర్తి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సత్యసాయి గిరి ప్రదక్షిణను శుక్రవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సంద ర్భంగా రాత్రి 7.00 గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం రథమును లాగుతూ భక్తి పాటలు పాడుతూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, పెట్రోల్ బంకు, చింతతోపు, గోవిందపేట శివాలయం వీధి, గోపురం రోడ్డు మీదుగా తిరిగి గణేష్ గేటు వద్దకు చేరుకుంది. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....