PLANTS: మొక్కలు ఎండుతున్నాయి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:06 PM
మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మున్సిపాలిటీ పరిధిలో మొక్కలను నాటి వాటి సంరక్షణను గాలికి వదిలేస్తుండడంతో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు హడావుడిగా మొక్క లను నాటడం తప్ప ఆ తరువాత వాటి గురించి పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు ఫ రూ.లక్షలు వృథా
అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తిన నిదర్శనం
ధర్మవరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మున్సిపాలిటీ పరిధిలో మొక్కలను నాటి వాటి సంరక్షణను గాలికి వదిలేస్తుండడంతో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు హడావుడిగా మొక్క లను నాటడం తప్ప ఆ తరువాత వాటి గురించి పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో నాటిన మొక్కలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. మొక్కల రక్షణ కోసం ట్రీగార్డులను సైతం కొన్ని చోట్ల ఏర్పాటు చేయక పోవడం వల్ల చాలా వరకు మొక్కలు నాటిన చోట ఖాళీ గుంతలే దర్శ నమిస్తున్నాయు. మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం నిధులు మంజూ రు చేసినా... మొక్కుబడిగా కార్యక్రమం చేపట్టి ఆ నిధులను కేవలం రికార్డులలో చూపి కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు కలె క్టర్ శ్యాం ప్రసాద్ గత ఏడాది సెప్టెంబరు 20న ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అయితే ఇక్కడ చాలా వరకు మొక్కలు సంరక్షణ లేక ఎండిపోవడం వల్ల అధికారుల ని రక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో సంబంధిత అధి కారుల అలసత్వం వల్లనే మొక్కల పెంపకం ప్రశ్నార్థకంగా మారింది. గ్రీన జిల్లాగా మార్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వ అశయాన్ని నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.
- ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో గత ఏడాది సెప్టెంబరు 20న కలెక్టర్‌తో పాటు ఇతర అధికారుల చేతులమీదుగా ఎనఎస్ గేటుకు వెళ్లే రహదారి పక్కన మొక్కలు నాటారు. ప్రధాన కూడళ్లలోని డివైడర్ల మద్య కూడా మొక్కలు నాటారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఆ మొక్కలను ప్రభుత్వ నర్సరీలో తెచ్చి నాటామని చెబుతున్నారే కానీ, ప్రైవేటు వారి వద్ద కూడా తెచ్చి నాటినట్టు తెలుస్తోంది.
వాటికి ఎక్స్‌క వేటర్‌తో గుంతలు తీయడానికి, ట్రీగార్డ్స్‌కు, వారం వారం నీరు పోయ డానికి వాహనాల డీజిల్‌కు రూ. లక్షలు బిల్లులు చేసుకుని స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి కాగితాల్లోని లెక్క లే కానీ క్షేత్రస్థాయిలో పచ్చని మొక్కలు కనిపించవు. అయితే రూ. లక్షల్లో మొక్కలు నాటామని రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్టు సమా చారం. నాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టడంలో అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపాలిటీ ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నాటిన మొక్కలను రక్షించకపోవడమే కాకుండా తీసిన గుంతల్లో మొక్కలు నాటకుండా వృధాగా వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకు నిదర్శనం ఎనఎస్‌గేటుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన నాటిన మొక్కలు, ఖాళీ గుంతలే సాక్ష్యాలు. కలెక్టర్ నాటిన మొక్కలకు నీరు పోయడానికి టెండర్లు పిలిచినా ఎవరు ముందుకు రాలేదని సాక్షాత్తు అధికారులే చెప్పడం విడ్డూరంగా ఉంది.
మొక్కలకు నీరుపోసేందుకు టెండర్లు పిలిచాం
- వీరేశ, డీఈ, మున్సిపాలిటీ, ధర్మవరం
పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటాం. వాటికి నీరు పోయ డానికి ట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. త్వరలో టెండర్లను పిలిచి నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరు పోసి సంరక్షిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....