CANAL: మరువ కాలువ అధ్వానం
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:32 PM
మండలంలోని పోతు కుంట గ్రామ చెరువు మరువపారుతోంది. ఇటీవ ల విడుదల చేసిన హం ద్రీనీవా నీటితో రేగాటిపల్లి చెరువు మరువ పారి పోతుకుంట చెరువుకు నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆ చెరువు మరువ పారుతోంది. అయితే పోతుకుంట చెరువు మరువ నుంచి నీరు వెళ్లే కాలువ పూడిపోయి, మరమ్మతులకు గురికావడంతో ఆ నీరంతా పొలాల్లోకి వెళుతోంది.
మరువ పారుతున్న పోతుకుంట చెరువు
పేరుకుపోయిన పూడిక, పెరిగిన జనుము
ముందుకు పారలేక పొలాల్లోకి వెళుతున్న నీరు
ధర్మవరం రూరల్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతు కుంట గ్రామ చెరువు మరువపారుతోంది. ఇటీవ ల విడుదల చేసిన హం ద్రీనీవా నీటితో రేగాటిపల్లి చెరువు మరువ పారి పోతుకుంట చెరువుకు నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆ చెరువు మరువ పారుతోంది. అయితే పోతుకుంట చెరువు మరువ నుంచి నీరు వెళ్లే కాలువ పూడిపోయి, మరమ్మతులకు గురికావడంతో ఆ నీరంతా పొలాల్లోకి వెళుతోంది. కాలువ పూర్తిగా పూడిపోవడంతో పా టు జనుము, కంపచెట్లతో నిండిపోయింది. దీంతో నీరు ముందుకు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలిచి పోతోంది. ఇక వర్షాలు వస్తే నీరంతా సమీ ప పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతినే పరిస్థితి నెలందని పోతుకుంట గ్రామ రైతులు వాపోతున్నారు. చెరువు నీరు పొలాల్లోకి రావడంతో రబీలో పంటలు సాగుచేసు కునేందుకు వీలులేకుండా పోయిందని రైతు లు పేర్కొంటున్నారు. మరువ కాలువ సుమారు రెండు కిలోమీటర్ల వర కు ఉందని, ఈ నీరు గొల్లపల్లి వంక వరకు వెళుతుందని గ్రామస్థులు తెలిపారు. అలాగే కాలువ సరిగా లేక పోవడంతో... చెరువు నుంచి నీ రు ఎక్కువగా పారినప్పుడు సమీపాన శ్మశాన వాటికలోకి చేరే అవ కాశం ఉందంటున్నారు. గతంలో ఎన్నడూ కాలువ స్థితిగతులపై పట్టిం చుకోకపోవడంతో అది పూడిపోయిందని విమర్శిస్తున్నారు.
ఇరిగేషన అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఖరీఫ్‌లో వరిసాగుచేశామని, అయితే నీరంతా పంటలో చేరి దిగుబడి దెబ్బతిన్నట్లు చెరువు సమీప సాగు రైతులు తెలిపా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువలోని చెట్లను తొలగించి, పూడిక తీయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పరిటాల శ్రీరామ్ దృష్టికి...కాలువ దుస్థితి
పోతుకుంట చెరువు మరువ కాలువ దుస్థితిని టీడీపీ గ్రామ నాయకులు ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కలెక్టర్ శ్యాంప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కాలువ మరమ్మతుల పనులను చేయించాలని అధికారులకు తెలియజేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
ప్రతిపాదనలు పంపాం - గురుప్రసాద్, మండల ఇరిగేషన ఏఈ, ధర్మవరం
కాలువ మరమ్మతులు చేపట్టాలని నిధులు కోసం ప్రతిపాదనలు పంపాం. కాలువ మరమ్మతుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. నిధులు మంజూరుకాగానే కాలువ అంతా సర్వే చేయించి మరమ్మతుల పనులు చేపడుతాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....