TDP: టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:06 AM
మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. శుక్రవారం ఉద యం స్వచ్ఛ భారత కార్యక్రమం కింద గ్రామంలో సర్పంచ కరుణాకర్‌నాయుడు, పంచాయతీ కార్యదర్శి భారతి వీధుల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
ఇద్దరికి గాయాలు
బత్తలపల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. శుక్రవారం ఉద యం స్వచ్ఛ భారత కార్యక్రమం కింద గ్రామంలో సర్పంచ కరుణాకర్‌నాయుడు, పంచాయతీ కార్యదర్శి భారతి వీధుల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. టీడీపీకి చెందిన వెంకటరమణ ఇంటి వద్ద మురుగు నీరు నిల్వ ఉన్న విషయమై సర్పంచ మాట్లాడుతూ.. ఇలా అపరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాప్తి చెందుతాయని వివరించారు. ఇదే విషయమై వాగ్వాదం తలెత్తింది. అంతలోనే పక్కనే ఉంటున్న టీడీపీ నాయకుడు నాగశేషు అక్కడికొచ్చారు. వైసీపీకి చెందిన వెంగల్‌రెడ్డి, మధుసూదనరెడ్డి, తులసిరెడ్డి కూడా వచ్చారు. వైసీపీ సర్పంచ, నాయకులు కలిసి.. వెంకటరమణ, నాగశేషుపై దాడి చేశారు. గాయపడిన వారిని బంధువులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సోమశేఖర్ గ్రామానికి వెళ్లి దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు.. ఆర్డీటీ ఆస్పత్రికెళ్లి బాధితులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. దివ్యాంగుడైన వెంకటరమణపై వైసీపీ నాయకులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారన్నరు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు నారాయణరెడ్డి, వీరనారప్ప, సురేంద్ర, గరశనపల్లి రవి పాల్గొన్నారు.