RTO: రోడ్డు నిబంధనలను పాటించండి : ఆర్టీఓ
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:00 AM
రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించా లని, అప్పుడే ప్రమాదాలు జరగవని ఆర్టీఓ రాణి ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. జాతీయ రహ దారి భద్రతా మాసోత్సవాలలో భాగం గా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని డిపో గ్యా రేజీలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
ధర్మవరం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించా లని, అప్పుడే ప్రమాదాలు జరగవని ఆర్టీఓ రాణి ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. జాతీయ రహ దారి భద్రతా మాసోత్సవాలలో భాగం గా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని డిపో గ్యా రేజీలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅ తిథిగా హాజరైన ఆర్టీఓ రాణి హాజరైను డ్రైవ ర్లకు పలు సూచనలు, సలహాలు తెలియజే శారు. డ్రైవర్లు విధులకు హాజరు కాగానే ముందుగా బస్సు కండీషన చెక్ చేసుకోవా లన్నారు. అదేవిధంగా మద్యం తాగి గానీ, పరధ్యానంలో ఉండిగానీ బస్సు నడపరాదన్నారు. బస్సును వేగంగా నడిపే టప్పుడు కుటుంబసభ్యులను గుర్తుకు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్‌టీఐ రమణమ్మ, గ్యారేజ్ అసిస్టెంట్ మోకానికల్ ఫోర్‌మ్యాన సికిందర్ పాల్గొన్నారు.
కదిరి అర్బన: ప్రమాదాలు నివారించేందుకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆర్టీవో కార్యాలయ ఆవరణంలో వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆర్టీఓ సూచించారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడతామన్నారు.నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.