• Home » Puttaparthi

Puttaparthi

ELECTRICITY: వేళపాళ లేని విద్యుత కోతలు

ELECTRICITY: వేళపాళ లేని విద్యుత కోతలు

వేళ పాళలేని విద్యుత కోతలతో అవస్థలు పడుతున్నామని మహమ్మదాబాద్‌ పంచాయతీ లోని ఐదు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ సబ్‌స్టేషనలో పంచాయతీలోని ఐదు గ్రామాల ప్రజలు శుక్రవారం స్థానిక విద్యుత సబ్‌స్టేషన వద్ద నిరసన వ్యక్తం చేశారు.

BUS STAND: శిథిలావస్థలో బస్టాండ్‌

BUS STAND: శిథిలావస్థలో బస్టాండ్‌

మండలంలోని తమ్మల గ్రామంలో ప్రధాన రహ దారిలో ఉన్న బస్టాండ్‌ శిథిలావస్థకు చేరింది. బస్టాండ్‌ గోడలు పూర్తి గా ధ్వంసమయ్యాయి. గ్రామానికి చెందిన ప్ర యాణికులు ధర్మవరం వెళ్లాలంటే బస్టాండ్‌ వద్దకు వచ్చి ఆటోలకు వెళుతుంటారు. బస్టాండ్‌ పూర్తి ఆసౌకర్యంగా ఉండటంతో వారు ఆటోల కోసం ఎండలో నిలబడాల్సి వస్తోంది.

RSK: కట్టించారు... వదిలేశారు

RSK: కట్టించారు... వదిలేశారు

మండలంలోని తుమ్మల గ్రామంలో ఉన్న రైతుసేవాకేంద్రాన్ని కట్టించారు. ప్రారంభించి నిరుపయో గంగా వదిలేశారు. రూ. లక్షలు నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలో విధులు నిర్వర్తించకపోవడం తో... ప్రస్తుతం దాని చుట్టూ కంపచెట్లు పెరిగి ఆధ్వానంగా తయారైంది. రూ. 18లక్షలతో ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని ప్రారంభించి వదిలేశారు.

RALLY: త్రివర్ణ పతాకంతో ర్యాలీ

RALLY: త్రివర్ణ పతాకంతో ర్యాలీ

మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు.

ICDS: ముగిసిన తల్లిపాల వారోత్సవాలు

ICDS: ముగిసిన తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు.

COLLECTOR : భూసేకరణను వేగవంతం చేయండి : కలెక్టర్‌

COLLECTOR : భూసేకరణను వేగవంతం చేయండి : కలెక్టర్‌

జిల్లాలో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు భూసేకరణ అంశంపై గురువారం ఆయన జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు.

ELECTRIC : పరిష్కారం కాని విద్యుత కష్టాలు

ELECTRIC : పరిష్కారం కాని విద్యుత కష్టాలు

అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ICDS: తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

ICDS: తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

TDP:  వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

మండలంలో వైసీపీ భారీ షాక్‌ తగిలింది. మండలంలో వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నాయకులు బుధవారం టీడీపీ మండల నాయకులు హర్షవర్దన, గణేశ ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాల యంలో తాడిమర్రికి చెందిన బండారు నరేంద్ర, పన్నూరు నాగభూషణ, హరిజన నరసింహుడు, తలారి నారాయణస్వామితో పాటు మొత్తం 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

MLA: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

MLA: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. టీఎనఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన యాంటీ డ్రగ్స్‌ పోస్టర్లను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులన్నారు. వారు డ్రగ్స్‌ కు ఆకర్షితుల అయితే దేశ భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి