HOUSES: పేదలకు ఇళ్లు ఎప్పుడో?
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:35 PM
నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి.
రూ.లక్షలు వెచ్చించి భూములు చదును చేశారు
ఇంటి పట్టాలు ఇవ్వడం మరిచారు
పేదలకు తప్పని ఎదురు చూపులు
నల్లమాడ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి. వాటిని తొలగించి, చదును చేయడానికి రూ. 60లక్షల నిధు లకు ప్రతిపాదనలు పంపారు. చదును చేసే పనులను ఇద్దరు కాంట్రా క్టర్లకు అప్పగించారు. వారు సొంత నిధులు వెచ్చించి, భూమిని చదును చేశా రు. అనంతరం ఆ భూమిలో అర్హులైన వారందరికి పట్టాలిస్తామని చె ప్పి, 500 మందికిపైగా పేర్లను రెవెన్యూ అధికారులు ఆనలైనలో న మో దుచేసినట్లు తెలుస్తోంది. ఇందులో 200 మందికి ఇంటి పట్టా లిచ్చినట్లు సమాచారం. అయితే ఇంటి పట్టాలు పొందిన వారికి స్థలాలు ఎక్కడు న్నాయో చూపలేదు, ఇళ్లు కూడా మంజూరుకాలేదు. పట్టాలిచ్చారని, ఇళ్లు మంజూరు చేస్తారని, పేదలు ఎంతో ఆశపడ్డారు. వారి ఆశలపై గత ప్రభుత్వం నీరు చల్లింది. భూమిని చదును చేసిన కాంట్రాక్టర్లు కూ డా రూ.60లక్షల బిల్లులు రాక నానా తిప్పలు పడుతున్నారు. వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నామని వారు వాపోతున్నారు. 18 ఎకరాల్లో మౌలి క వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే మండలపరిధిలోని దొ న్నికోట, రామాపురం, బొగ్గలపల్లి, రెడ్డిపల్లి, పులగంపల్లి, ఎర్రవంకపల్లి, తదితర పంచాయతీల్లోనూ జగనన్నకాలనీల పేరుతో రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాలకు దూరంగా భూములను చదును చేశారు. అరకొరగా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొంత మంది మాత్రమే ఇళ్లు నిర్మిం చుకున్నారు. మండలంలోని రెండు పంచాయతీల్లో మినహా, జగనన్న కాలనీలన్నీ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. అప్పట్లో లబ్ధిదారులు అధికారుల వద్దకెళ్లి తమ పేర్లును ఆనలైనలో నమోదు చే యించుకున్నా, ఇళ్లు మంజూరు కాలేదు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లబ్ధిదారులు అధికారుల వద్దకు వెళ్లి అడిగితే, వారికి గతంలోనే ఇళ్లు మంజూరైనట్లు ఆనలైనలో ఉన్నట్లు అధికారులు చెబు తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మళ్లీ ఆనలైన చేయడం కుర దరంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు మండలంలో చాలమంది ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18నెలలు గడుస్తున్నా, నల్ల మాడలోని లేఅవుట్‌లో ఎవరికీ పట్టాలివ్వలేదు. ఇళ్లు మంజూరు చేయలేదు. నాలుగేళ్ల నుంచి 18ఎకరాల భూమి నిరుపయోగంగా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పాలకులు ఆలేవుట్‌లో లబ్ధిదా రులకు పట్టాలిచ్చి ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
దశవారీగా ఉద్యమాలు- కుంచెపు చంద్ర, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు
పేదలకు ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వంలో రూ.లక్షలు ఖర్చు పెట్టి 18ఎకరాల భూమిని చదును చేశారు. అయితే అదిగోఇదిగో అంటూ కాలయపాన చేసి ఆ ప్రభు త్వం వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం అధికా రం చేపట్టి 18నెలలు గడుస్తోంది. ఈప్రభుత్వమైనా 18ఎకరాల లేఅవుట్‌ను పరిశీలించి, లబ్ధిదారులకు పట్టాలి చ్చి ఇళ్లు మంజురు చేయాలి. అలా ఇవ్వకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతాం.
ఇళ్లలేనివారికి పట్టాలివ్వండి - గంగాధర్, ఆర్సీపీ జిల్లా కార్యదర్శి
మండల వ్యాప్తంగా ఇళ్లలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం పట్టా లివ్వాలన్నారు. ఇళ్లలేని పేదలు అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని గత వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. భూమిని చదును చేసింది. ఆ భూ మిలో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పిందే కానీ, ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం ఆ లేఅవుట్‌ను పరిశీలించి, అర్హులైనవారికి ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....