Share News

STUDENTS: అబాకస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:14 PM

హైదరాబాద్‌కు చెందిన విశ్వం ఎడ్యుటెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్‌, వేధిక్‌ మ్యాథ్స్‌ జోనల్‌ లెవల్‌ పరీక్షలలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్టు జోనల్‌ మేనేజర్‌ శివాంజనేయులు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ....కాకతీయ విద్యానికేతనలో నిర్వహిం చిన ఈ పరీక్షలకు పట్టణంలోని 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.

STUDENTS: అబాకస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు
The scene of presenting gift and certificate to meritorious students

ధర్మవరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన విశ్వం ఎడ్యుటెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్‌, వేధిక్‌ మ్యాథ్స్‌ జోనల్‌ లెవల్‌ పరీక్షలలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్టు జోనల్‌ మేనేజర్‌ శివాంజనేయులు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ....కాకతీయ విద్యానికేతనలో నిర్వహిం చిన ఈ పరీక్షలకు పట్టణంలోని 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో 50 మంది ప్రతిభ కనబరచగా, అందులో తమ పాఠశాలకు చెందిన 12మంది ఉన్నారని తెలిపారు. ప్రతిభ కనబరచిన 50 మందికి ప్రోత్సా హక బహుమతులతో పాటు సర్టిఫికెట్లను ముఖ్యఅతిథులుగా హాజరైన కాకతీయ విద్యానికేతన కరస్పాండెంట్‌ నిర్మలాదేవి, డైరెక్టర్‌ సూర్యప్రకాశరెడ్డి చేతులమీదుగా అందజేశారని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 04 , 2026 | 11:14 PM