TDP: ఇప్పుడూ అదేతీరేనా?
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:54 PM
అధికారంలో ఉన్నప్పుడు బెదిరిం పులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని, ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగనపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్దిదారులకు రూ.12.90లక్షల వి లువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన సోమవారం పట్టణంలోని టీడీ పీ ఎర్రగుంట కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీచేశారు.
జగనపై పరిటాల శ్రీరామ్ మండిపాటు
ధర్మవరం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు బెదిరిం పులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని, ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగనపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్దిదారులకు రూ.12.90లక్షల వి లువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన సోమవారం పట్టణంలోని టీడీ పీ ఎర్రగుంట కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీచేశారు. అనం తరం పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని వేగవంతంగా చే యాలని పీపీపీ మోడల్లో చేపడితే దాన్ని జగనరెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు.
టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పరిశే సుధాకర్, నాగూర్‌హుస్సేన, మాదవరెడ్డి, కేశగాళ్ల శీన, మేకల రామాంజి, అడ్ర మహేశ, శ్రీరాములు, రామకృష్ణ, బాబ్జి, లోకేశ, ముదిగుబ్బ నాయకులు తుమ్మల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీచేసినట్లు బీజేపీ నియోజ కవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కార్యా లయంలో నియోజకవర్గ పరిధిలోని 26 మందికి మంజూరైన రూ.14,32,987 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీనాయకులు ఆకులేటి వీరనారప్ప, పోతుల నాగేపల్లి లక్ష్మీనారాయణ, శీన, నరసింహు లు, ఏలుకుంట్ల లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు నబీరసూల్, సోమ్లానాయక్, రవి, భాస్కర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....