MLA: ఏపీ అభివృధ్ధికి చిరునామా సీఎం
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:48 PM
ఏపీ అభివృద్ధికి చిరునామా ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే ప ల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నతపాఠశాల వసతిగృహం నిర్మా ణానికి వారు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన శాఖాధికారి రాజేంద్రరె డ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె
నల్లమాడ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధికి చిరునామా ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే ప ల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నతపాఠశాల వసతిగృహం నిర్మా ణానికి వారు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన శాఖాధికారి రాజేంద్రరె డ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడు తూ వసతిగృహం భవనాలకు రూ.5.88 కోట్లు నిధులు మంజూరు చే యించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. అనంతరం, తహసీల్దార్ మనోజ్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదే శించారు. అనంతరం నల్లమాడ క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వ హించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుప త్రిలో అన్ని వసతులతో అన్ని రకాల రోగులకు అవసరమైన అన్ని విభా గాలను ఏర్పాటు చేశామన్నా రు. ప్రజల కోరిక మేరకు 30పడకల ఆసుపత్రిని 50పడకలకు పెంచేం దుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ మనోజ్ కుమార్‌రెడ్డి, ఇనచార్జ్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు డీఈ రియాజుద్దీన, వైద్యాధికారులు బాబ్‌జాన, మహేష్, సర్పంచ రమావత భారతి, ప్రధానోపాధ్యాయుడు సతీష్‌కుమార్, నాయకులు గడ్డం రమణా రెడ్డి, మైలే శివశంకర్, ఎల్‌ఐసి నరసింహులు, జయ చంద్ర, గోపాల్‌రెడ్డి, కేశవరెడ్డి, బుట్టినాగభూషణనాయుడు, కేశవరెడ్డి, దేశాయి మంజునాథ్ రెడ్డి, మణికుమారి, మంజునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....