MLA: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:37 PM
మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
కదిరి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ధీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు పేరుకుపోతు న్నాయన్నారు. రెవెన్యూ కార్యాలయంలోకి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉం డేదని, ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసం పనిచేస్తున్నా యన్న నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రెవెన్యూ అఽధికారులు అక్కడిక క్కడే సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నిషా, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....