Share News

MLA: నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కందికుంట

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:21 PM

మునిసిపాలిటీ పరిధిలోని 33, 34 వార్డులలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పరిష్కరించారు. నీటి కోసం 33, 34 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న టీడీపీ స్థానిక నా యకులు సమస్యను ఎమ్మెల్యే కందికుంట దృష్టికి తీసుకెళ్లారు.

MLA: నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కందికుంట
TDP leaders solving water problem in wards

కదిరి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని 33, 34 వార్డులలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పరిష్కరించారు. నీటి కోసం 33, 34 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న టీడీపీ స్థానిక నా యకులు సమస్యను ఎమ్మెల్యే కందికుంట దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి అక్కడ బోర్లు వేయాలని కదిరి మునిసిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అఽధికారులు వెళ్లి ఆయా వార్డులలో బోర్లు వేయించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకి ధన్యవాధాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన ,33వ వార్డు నాయకుడు రమణానాయుడు, టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సల్మాన ఖాన, 34వ వార్డు నాయకులు రవి, నరసింహులు, కిష్ట, హేమేంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 04 , 2026 | 11:22 PM