TDP : ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకోండి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:57 PM
పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు ఆర్డీవో మహేశకు విన్నవించారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవోను కలిసి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు.
ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు
ధర్మవరం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు ఆర్డీవో మహేశకు విన్నవించారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవోను కలిసి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు ఆర్డీవోతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలను విచ్చలవిడిగా ఆక్రమించారని ఆరోపించారు. వాటిలో వాణిజ్య సముదా యాలను నిర్మించి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. వెంటనే ఆ భవనాలను ప్రభుత్వం స్వాధీన చేసుకోవాలని విన్నవించారు. వీటి పై విచారణకు ఆదేశిస్తామని, అక్రమణలకు గురైన మున్సిపల్, రెవెన్యూ రిజర్వుడ్ స్థలాలను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పరిశేసుధాకర్, నాగూర్‌హుస్సేన, పురుషోత్తంగౌడ్, భీమనేని ప్రసాద్‌నాయుడు, మాధవరెడ్డి, కేశగాళ్ల శ్రీనివాసులు, తలారి చంద్రమోహనబాబు, చీమల రామాంజి, అత్తర్ రహీం, రామకృష్ణ, తిరుపాలు, వంటరమేశ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....