Share News

TRUST: యువతకు త్రికరణ శుద్ధి అవసరం

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:18 PM

త్రికరణ శుద్ధి, దృఢ సంకల్పం, సామాజిక స్పృహ ఉన్న యువత నాయకుడిగా ఎదగగలరని సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్‌ పాండే పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

TRUST: యువతకు త్రికరణ శుద్ధి అవసరం
Members of the Trust launching Sathya Sai Prerna's book

సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు

పుట్టపర్తి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): త్రికరణ శుద్ధి, దృఢ సంకల్పం, సామాజిక స్పృహ ఉన్న యువత నాయకుడిగా ఎదగగలరని సత్య సాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్‌ పాండే పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొన్న ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి వ్యక్తి మొదట తన శరీరానికి గౌరవం, రక్షణ చూసుకోవాలన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసం పొందగలడన్నారు. మంచి ఆలోచనలు, మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, మిత భాష, మనసును ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి తన జీవితంలో ఎప్పటికైనా నాయకుడిగా గుర్తింపు పొందగలడన్నారు. సత్య సాయి ప్రేమ, సేవ, భజనలు జీవితాన్ని ప్రశాంతంగా సాగిస్తాయన్నా రు. సామాజిక సేవకు సత్యసాయి సేవాదళ్‌ వేదికగా లక్షల మంది సే వా కార్యక్రమాలను చేస్తున్నారని, సేవలోనే సంతృప్తి ఉందన్న సత్యసా యి సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించినప్పుడు ఆ జీవితానికి సార్థకత ఉం టుందన్నారు. అనంతరం సత్యసాయి స్టడీస్‌ చైర్‌ పర్సన డాక్టర్‌ సుమ, డాక్టర్‌ మాధురి ట్రైనింగ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ గోపికృష్ణ ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న 381 మంది యువతకు సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన చక్రవర్తి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సత్యసాయి ప్రేర ణ పుస్తకాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, నిమిష్‌ పాండే ఆవిష్కరించారు. అనంతరం భక్తి పా టలు ఆలపించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 04 , 2026 | 11:18 PM