TDP: వైసీపీ నాయకుల ఆక్రమణలో మున్సిపల్‌స్థలాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:10 PM
గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయ కులు ధర్మవరంలో పెద్దఎ త్తున మున్సిపల్, రెవెన్యూ స్థలాలను కబ్జా చేశారని, వాటిలో వాణిజ్య సము దా యాలను నిర్మించి విచ్చల విడిగా ప్రజాదనాన్ని దోపి డీ చేస్తున్నారని టీడీపీ నా యకులు ఆరోపించారు.
-ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న
రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం
-టీడీపీ నాయకుల ఆరోపణ
ధర్మవరం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయ కులు ధర్మవరంలో పెద్దఎ త్తున మున్సిపల్, రెవెన్యూ స్థలాలను కబ్జా చేశారని, వాటిలో వాణిజ్య సము దా యాలను నిర్మించి విచ్చల విడిగా ప్రజాదనాన్ని దోపి డీ చేస్తున్నారని టీడీపీ నా యకులు ఆరోపించారు. స్థానిక గాంధీనగర్‌లోని టీ డీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకులు నాగూర్ హుస్సేన, భీమనేని ప్రసాద్ నాయుడు, పురుషోత్తంగౌడ్, రాళ్లపల్లి షరీఫ్, అస్లాం, అత్తర్ రహీం మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ఎక్కడపడితే అక్కడ రూ. కోట్లు విలువ చేసే మున్సిపల్, రెవెన్యూ స్థలాలను కబ్జాచేశారని ఆరోపించారు. వాటి గురించి ఎన్నిసార్లు మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడంలో ఆ శాఖల అధికారులు ఘోరంగా విఫలమయ్యా రని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎర్రగుంట సర్కిల్ లోని సర్వే నంబర్ 620లో మున్సి పల్ రిజర్వుడ్ స్థలాన్ని వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధి, కొంతమంది వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కబ్జా చేశారన్నారు.
ఆ నిషేధిత భూమిని అప్పట్లో తమ అధికార దర్పంతో రిజిస్టర్ చేయించుకుని వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని అన్నారు. మున్సిపల్ రిజర్వుడ్ స్థలాల్లో నిర్మించిన వాణిజ్య భవనాలను మున్సిపల్ అధికారులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగా లను డిమాండ్‌చేశారు. అదే విధంగా సర్వే నంబర్ 536లో రేగాటిపల్లి రోడ్డు నుంచి చె రువులోకి వెళ్లే కాలువను సైతంకబ్జా చేసి వాణిజ్య సముదాయం నిర్మించి అద్దెలకు ఇస్తు న్నారని ఆరోపించారు. రిజర్వుడ్ స్థలాలను కా పాడటంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మొద్దునిద్రలో ఉన్నారన్నారు. వైసీపీ స్థానిక నాయకులకు భయపడి చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని వారు ఎద్దేవాచేశారు. గత కొన్ని సంవత్సరాలు గా పార్థసారథినగర్‌లోని 25వ వార్డులో స్థానిక ప్రజాప్రతినిది మున్సిపల్ రిజరుడ్వ్ స్థలాన్ని కబ్జా చేసిన విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారుల దృష్టికి, సీఎం చంద్రబాబు, , మంత్రి నారా లోకేశ దృష్టికికూడా తీసుకెళ్లామన్నారు. కావున పట్టణంలో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడిన రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌చేశారు. జగన సొంత పత్రిక లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా రాసి టీడీపీపై బుర దచల్లాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా చేసిన కబ్జాలను ప్రజల దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని వారు ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....