• Home » Puttaparthi

Puttaparthi

CELEBRATIONS: గణేశ ఉత్సవాలకు సర్వ సిద్ధం

CELEBRATIONS: గణేశ ఉత్సవాలకు సర్వ సిద్ధం

జిల్లా వ్యాప్తంగా గణేశ ఉత్సవాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేపట్టారు. బుధవారం గణేశ విగ్రహాలు ఏర్పాటుచేయాల్సి ఉండగా మంగళవారమే విగ్రహాలను ఆయా ప్రాంతాలకు చేర్చారు. జిల్లా కేంద్రంతో పాటు హిందూపురం, ధర్మవరం, కదిరి కేంద్రాలలో భారీ విగ్రహాలను నిలబెట్టడానికి ఒకరోజు ముందే వినాయక ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు.

MLA: పేద కుటుంబాలకు చంద్రబాబు అండ

MLA: పేద కుటుంబాలకు చంద్రబాబు అండ

పేద కుటుంబాలను ఆదు కునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండంత ఆండగా ఉన్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమవా రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

FESTIVAL: పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

FESTIVAL: పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవా లని డీఎస్పీ విజయ్‌కుమార్‌ వినాయక ఉత్సవ కమిటీ, పీస్‌ కమిటీలకు సూచిం చారు. ఎస్పీ వి. రత్న ఆదేశాల మేరకు ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని సాయిఆరామంలో పుట్టపర్తిటౌన, పుట్టపర్తి రూరల్‌, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీలు, పీస్‌ కమిటీలతో సమావేశం నిర్వహిం చారు.

SACHIVALAYAM: ఇలా వదిలేస్తే ఎలా..?

SACHIVALAYAM: ఇలా వదిలేస్తే ఎలా..?

వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని సచివాలయాలు ఏర్పాటు చేసి, భవన నిర్మాణాల విషయంలో వాటిని పూర్తి చేయాలేక ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్‌చేస్తామని తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు.

BJP: జిల్లా కేంద్రం తరలింపు అపోహే

BJP: జిల్లా కేంద్రం తరలింపు అపోహే

జిల్లా కేంద్రం మార్పుపై ఇటీ వల వస్తున్న వదంతులు కేవ లం ఆపోహ మాత్రమేనని, వాటిని నమ్మాల్సిన అవసరంలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడెసె దేవానంద్‌, జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గుడెసె దేవానంద్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు.

SEWAGE: రోడ్డుపై మురుగునీటి ప్రవాహం

SEWAGE: రోడ్డుపై మురుగునీటి ప్రవాహం

మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోందని గ్రామస్థు లు వాపోతున్నారు. మురుగునీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన కాలువలు చెత్తచెదారంతో నిండిపోయాయి. జీన్లకుంట రోడ్డులోని వెలుగు కార్యా లయానికి వెళ్లే దారిలో కాలువ పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే పారుతోంని. ఆ నీటిలోనే నడుచుకుంటూ కార్యాలయాలకు, వీధిలోకి వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.

TDP: ప్రజా సమస్యలపై పరిటాల శ్రీరామ్‌ దృష్టి

TDP: ప్రజా సమస్యలపై పరిటాల శ్రీరామ్‌ దృష్టి

పట్టణంలో నిర్వహించిన ‘మీ సమస్య-మా బాధ్యత ’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం టీడీపీ నియోజకవర ్గఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ గురువారం సచివాలయాల బాట పట్టారు. పట్టణంలోని 25వ వార్డులో పార్థసారఽథి-2, 30వ వార్డు పరిధిలోని దుర్గానగర్‌ సచివాలయాల వద్దకు స్వయంగా వెళ్లి సచివాలయ సిబ్బందికి అర్జీ లను ఆందజేశారు. టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

MRC: వర్షానికి తడుస్తున్న ఎమ్మార్సీ

MRC: వర్షానికి తడుస్తున్న ఎమ్మార్సీ

మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాల ఆవరణంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయం ఇటీవల కురిసిన వర్షానికి కారుతోంది. ఈ భవనాన్ని 1999లో నిర్మించారు. ఈ కార్యాలయంలో ఇద్దరు ఎంఈఓలు, ఒక ఎంఐసీ కోఆర్డినేటర్‌, ఓ ఆపరేటర్‌, ఓ మెసెంజర్‌ విధులు నిర్వహిస్తుంటారు. మండల వ్యాప్తంగా 63 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.

ROAD: రోడ్డుపై గుంతల్లో నీరు

ROAD: రోడ్డుపై గుంతల్లో నీరు

మండల పరిధిలోని లోచర్లలో పెనుకొండ రహదారి పక్కనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. పాఠశాలకు ఎదురుగా రోడ్డు గుంతల మయం కావడంతో ఇటీవల వర్షాల కు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి