VEMANA: వేమన జయంతికి ముమ్మర ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:45 PM
యోగా వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా మండలపరిధిలోని కటారుపల్లి ఆలయ ప్రాంగ ణంలో పలు అభివృధ్ది పనులను ముమ్మరంగా చేపట్టారు. కటారుప ల్లిలో ప్రజాకవి విశ్వవేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
గాండ్లపెంట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): యోగా వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా మండలపరిధిలోని కటారుపల్లి ఆలయ ప్రాంగ ణంలో పలు అభివృధ్ది పనులను ముమ్మరంగా చేపట్టారు. కటారుప ల్లిలో ప్రజాకవి విశ్వవేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. వేమన ఆలయానికి సంబంధించిన విడిది గృహానికి రంగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో పూల మొ క్కలు నాటుతున్నారు. పచ్చని గడ్డిని పార్కు నిండా పరిచారు. అలాగే వేమన ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేం దుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆలయం ఎదురుగా సభా వేదిక, భోజన శాల, భారీ టెంట్లు వేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం వా హనాల పా ర్కింగ్‌కు స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను గ్రీన అంబాసిడర్‌లతో తొలగించారు. జయంతి ఉత్సవాలకు కావల్సిన ఏర్పాట్లు వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్నాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....