Share News

MPTC: గౌరవ వేతనం ఇస్తారా..?

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:53 PM

ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనం మూడున్నరేళ్లుగా చెల్లించలేదని, తమ పదవీకాలం పూ ర్తి అయ్యేలోగా చెల్లిస్తారా? అని కోటపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ అధికారులను ప్రశ్నించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వైవీ కౌసల్య అధ్యక్షతన అధికారులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

MPTC: గౌరవ వేతనం ఇస్తారా..?
MPTC member Venkatasubbamma is questioning the officials

మండల సమావేశంలో సభ్యుల డిమాండ్‌

తనకల్లు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనం మూడున్నరేళ్లుగా చెల్లించలేదని, తమ పదవీకాలం పూ ర్తి అయ్యేలోగా చెల్లిస్తారా? అని కోటపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ అధికారులను ప్రశ్నించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వైవీ కౌసల్య అధ్యక్షతన అధికారులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనంపై చర్చలు కొనసాగాయి. మూడున్నరేళ్లు అయినా గౌరవ వేతనం చెల్లించక పోవడం ఏమిటని సభ్యులు అధికారులను నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే చెల్లిస్తామని ఎంపీడీఓ రాంప్రసాద్‌ తెలిపారు. విద్యాశాఖపై చర్చ కొనసాగగా, మం డలంలోని డేగానివారిపల్లి, మొగిలిచెట్లతండాల్లో ప్రభుత్వం పాఠశాలల కోసం కేటాయించిన భూములను కొంతమంది కబ్జా చేసినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని ఎంఈఓ లలితమ్మ రెవెన్యూ అధికారుల దృష్టికితెచ్చారు.


ఈ విషయాలను ఇప్పటికే పరిశీలించి, నివేదికల ను ఉన్నతాధికారులకు పంపినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ మల్లికార్జన తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహి స్తున్నామని, ఏ సమస్య అయినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామ న్నారు. ఉపాధి పథకం పేరు మార్పు చేశారని, ఇకపై ఉపాఽధి కోరిన 15 రోజుల్లోగా పనులు కల్పించకపోతే నిరుద్యోగభృతి చెల్లిస్తామని ఏపీఓ మరియమ్మ తెలిపారు. ఉమెన ఎంపవర్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఒక యాప్‌ విడుదలచేసిందని, ఇకపై రుణాలకోసం యాప్‌లోనే దరఖాస్తు లు చేసుకోవాలని ఏపీఎం జయంతి తెలిపారు. మండలంలో 13నూతన అంగనవాడీ కేంద్రాల మంజురుకోసం సిపార్సులను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీ దేవమ్మ పేర్కొన్నారు. ఆర్టీసీపై చర్చ కొనసాగగానే గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడనప్పుడు సమావేశాలకు రావడం ఎందుకని సభ్యులు నిలదీశారు. ప్రతి సమావేశంలోనా మండలంలోని మారుమూల గ్రామాలైన మల్లిరెడ్డిపల్లి, కోటపల్లి, గ్రురంబైలు, అద్దానంపల్లి, టి.సదుం, కొక్కంటి, చెక్కవారిపల్లి, తురకవానిపల్లి గ్రామాలకు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టీసీ స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి నివేదికలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 17 , 2026 | 11:53 PM