NTR: ఎన్టీఆర్ ఓ సంచలనం :ఎమ్మెల్యే కందికుంట
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:48 PM
దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే.. ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
కదిరి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే.. ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం చరిత్రాత్మకం అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు, సేవల ద్వారా ఆయన తెలుగువారి గుండ్లెల్లో చిరస్థా యిగా నిలిచారని కొనియాడారు. రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలుచేయడం అనేది టీడీపీ ఆవిర్భావం తర్వాతనే అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....