NTR: పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ తనకు తానే సాటి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:57 PM
పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ తనకు తానే సాటి అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీ జేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్, పరి టాల రవీంద్ర జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్ర దర్శన ఏర్పాటుచేశారు.
ధర్మవరం, జనవరి 18(ఆంద్రజ్యోతి): పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ తనకు తానే సాటి అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీ జేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్, పరి టాల రవీంద్ర జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్ర దర్శన ఏర్పాటుచేశారు. ముందుగా క్రీడామైదానంలో మొక్కలు నాటా రు. అనంతరం వారు మాట్లాడుతూ...ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానటుడిగా కాకుండా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి డిల్లీగల్లీలో సత్తాచాటి ప్రపంచానికే తెలుగోడి గొప్పతనాన్ని చాటార న్నారు. మాజీమంత్రి పరిటాలరవీంద్రను టీడీపీలోకి ఆహ్వానించి పె ద్దపీట వేశారన్నారు. పరిటాల రవీంద్ర పేదల అభ్యున్నతి కోసం కృషి చేసి బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముద్ర వేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలకు డ్యాన్సులు చేసి అలరించారు. అనంతరం అష్టమాంకాలు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....