Share News

KING: ఘనంగా కృష్ణదేవరాయల జయంతి

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:56 PM

ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని రాయల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నాయకులు కొనియాడారు. శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోనేరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

KING: ఘనంగా కృష్ణదేవరాయల జయంతి
Leaders of Balija community paying tributes in Kadiri

కదిరి అర్బన/ముదిగుబ్బ/ అమడగూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని రాయల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నాయకులు కొనియాడారు. శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోనేరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నాయకులు కుటాల లక్ష్మణ్‌, సుదర్శన, కరావుల సతీష్‌, వెంకటరమణ, రాజారామ్‌, విశ్వనాథ్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే ముదిగుబ్బ మండల కేంద్రంలోని రైల్వేస్టేషన రోడ్డులో శ్రీకృష్ణదేవ రాయల చిత్రపటానికి బలిజ సంఘం పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కేక్‌ కట్‌చేసి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో బ్యాగ్‌లను పంపిణీ చేశారు. అమడగూరు మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఎదుట బలిజ కాపులు శ్రీకృష్ణ దేవరాయల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు గోపాల్‌, కృష్ణమూర్తి, చిన్నప్ప, జయప్ప తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 17 , 2026 | 11:56 PM