NTR: సమాజంలో మార్పులకు నాంది: పరిటాల శ్రీరామ్
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:52 PM
రాష్ట్రంలో మార్పు చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విగ్రహాలు ఉండాలంటే... అవి కేవలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, టీడీపీ వ్యవ స్థాపకులు ఎన్టీ రా మారావుకే చెల్లు అన్నారు.
ధర్మవరం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మార్పు చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విగ్రహాలు ఉండాలంటే... అవి కేవలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, టీడీపీ వ్యవ స్థాపకులు ఎన్టీ రా మారావుకే చెల్లు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆదివారం పట్టణంలోని గాంధీనగర్‌లో టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్‌లో, కొత్తపేట సర్కిల్‌లో ఉ న్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సం దర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ...
రాష్ట్రంలో సంక్షేమ పథకాల ను ప్రజలకు చేరువ చేసిన ఘనత గతంలో ఎన్టీఆర్‌కు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారని... కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదలను ఆదుకున్న మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరె క్టర్ కమతం కాటమయ్య, టీడీపీ నాయకులు చింతలపల్లి మహేశ చౌదరి, పరిశే సుధాకర్, మద్దిలేటి, ఫణికుమార్, నాగూర్ హుస్సేన, పురుషోత్తంగౌడ్, సంధా రాఘవ, చింతపలుసు పెద్దన్న, రాళ్లపల్లి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎనబీకే ఫ్యాన్స ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
- అదేవిధంగా పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లోని పట్టణాలు, మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....