Share News

ROAD: ఇంకెన్నాళ్లు...రోడ్డు కష్టాలు?

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:41 PM

ఎగుడు దిగుడు, గుంతల రోడ్లతో ప్రయాణం భా రమవుతోంది. పాలకులు మారినా తమ బాధలు తప్పలేదని వెంకటాపురం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండలపరిధిలో కదిరి - హిందూపురం ప్రధాన రహదారి... వెంక టాపురం పంచాయ తీ లోని నారప్పగారిపల్లి నుంచి వెంకటాపురం మీదుగా కరకమాను తోపు వరకు పూర్తిగా దెబ్బ తింది.

ROAD: ఇంకెన్నాళ్లు...రోడ్డు కష్టాలు?
Gravel road to Venkatapuram

-ఎగుడు దిగుడు రోడ్డుపై ప్రయాణం భారం

- వెంకటాపురం పంచాయతీ ప్రజల ఆవేదన

ఓబుళదేవరచెరువు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఎగుడు దిగుడు, గుంతల రోడ్లతో ప్రయాణం భా రమవుతోంది. పాలకులు మారినా తమ బాధలు తప్పలేదని వెంకటాపురం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండలపరిధిలో కదిరి - హిందూపురం ప్రధాన రహదారి... వెంక టాపురం పంచాయ తీ లోని నారప్పగారిపల్లి నుంచి వెంకటాపురం మీదుగా కరకమాను తోపు వరకు పూర్తిగా దెబ్బ తింది. గత్యంతరం లేక కొన్నేళ్లుగా అదే రోడ్డులో ప్రజలు ప్రయాణం సా గిస్తున్నారు. పలువురు ద్విచక్రవాహనదారులు ఈ రోడ్డుపై ప్రమాదా లకు గురవుతున్నారు. గతంలో రోడ్డు బాగుండడంతో మండలకేంద్రమైన ఓడీసీ నుంచి నారప్పగారిపల్లి మీదుగా వెంకటాపురానికి 10 నిమిషాల్లో చేరుకునేవారు. ప్రస్తుతం రెట్టింపు సమయం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇక రాత్రి సమయంలో ఆ రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో కనపడక తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. ఈ రహదారిలో నారప్పగారిపల్లి, రామిరెడ్డిపల్లి, వెంకటా పురం, బోగానిపల్లి, కుంట్లపల్లి, చెర్లోపల్లి, వీర ఓబన్నపల్లి ప్రాంతాల వా సులతో పాటు అమడగూరు ప్రాంతవాసులు ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్డు మరమ్మతులకు గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు అధి కారులకు విన్నవించినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. కూ టమి ప్రభుత్వం అయినా స్పందించి దెబ్బతిన్న రోడ్డుకుు మరమ్మతులు చేయాలని లేదా నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సు సౌకర్యం ఏదీ?

రోడ్డు దెబ్బతినడంతో పాటు గత రెండు దశాబ్దాకాలంగా బస్సు సౌ కర్యం లేకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఆటోలను ఆశ్రయించాల్సి వ స్తోంది. 20 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బస్సు సౌకర్యం ఉండేది. కాల క్రమేణా బస్సు సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేక పల్లెవాసులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. పలుమార్లు అధికా రు లకు విన్నవించినా ఫలితం లేదని ప్రజలంటున్నారు. రోడ్డు మరమ్మ తులతో పాటు బస్సు నడపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 17 , 2026 | 11:41 PM