GOD: పెద్దమ్మకు బోనాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:01 AM
మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు ముక్కనుమ ఆదివా రం సందర్భంగా భక్తులు ఘనంగా జ్యోతులు, బోనాలు సమర్పించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ముదిగుబ్బ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు ముక్కనుమ ఆదివా రం సందర్భంగా భక్తులు ఘనంగా జ్యోతులు, బోనాలు సమర్పించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని వెండి ఆభరణాలు, వెండి గొడుగులు, వేపమండలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించినట్లు పూజారు లు పెద్దన్న, సోము, శివసాయి తెలిపారు. భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మహిళలు అమ్మవారికి చీరలు, గాజులు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....