Home » Puttaparthi
పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో బుఽధవారం పద్మశాలీయ బ హూత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో మూల విరాట్‌కు, ఉత్స వ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనఎంలకు ఇతర డ్యూటీలు వేయరాదని ఎన్జీఓ సంఘం నాయకులు కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం వారు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి, తమ సమస్యలను వివరించారు. ము ఖ్యంగా ఏఎనఎంలకు ఇతర పనులు ఇవ్వడం వలన డ్యూటీకి ఇబ్బందిగా ఉందని వివరించారు.
ఆ ప్రయాణికుల అవ స్థలు వర్ణనాతీతం. బస్సుల కోసం ఎండైనా, వాన కురిసినా భరిస్తూ ఎ దురుచూడాల్సి వస్తోంది. ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనం తపురానికి వెళ్లే రహదారిలో ఒక్క బస్ షెల్టర్ కూడా లేదు. దీంతో ప్ర యాణికులు అవస్థలు పడుతున్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మం డలపరిధిలోని 14 పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి, తనిఖీ చేశారు. వాటి ఖర్చులు, వివరాలను ప్రజావేదికలో వెల్లడించింది.
త్యాగానికి ప్రతీక వాసవీ మాత అని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వా సవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం బుక్కపట్నం లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలో ్లఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలుచేశారు.
తన పద్యాల ద్వారా సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ (జేసీ) మౌర్యభరద్వాజ్ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
పేరు గొప్ప....ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కొత్త చెరువు మండల కేంద్రం పరిస్థితి. ఇది జిల్లా కేం ద్రానికి ముఖద్వారం వలె ఉంది. అయితే మండల కేంద్రంలో బస్టాండ్ ఉ న్నా నాలుగురోడ్ల కూడలి కి దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడికి వెళ్లరు. దీంతో బస్సులు కూడా అక్కడికి వెళ్లవు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు.
మండలపరిధిలోని గొ ట్లూరులో సోమవారం మహంకాళమ్మ ఆల యం 14వ వారికోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.