Share News

GOD: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:40 PM

పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో బుఽధవారం పద్మశాలీయ బ హూత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో మూల విరాట్‌కు, ఉత్స వ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

GOD: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి
A ceremonial idol of the Lord worshiped at Dharmavaram

ధర్మవరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో బుఽధవారం పద్మశాలీయ బ హూత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో మూల విరాట్‌కు, ఉత్స వ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతర అలయం నుంచి ర్యాలీగా ప్రభుత్వ ఆస్ప త్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ తిప్పేంద్ర నాయక్‌ చేతుల మీదుగా రోగుల కు పాలు, బ్రెడ్డు, పండ్లు పంపిణీచేశారు. ఆ సంఘం అధ్యక్షుడు పుత్త రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింకా నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.

నల్లచెరువు: మండలకేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి ఆలయంలో స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శివనారాయణస్వామి, ఆర్డీఓ వీవీ ఎస్‌ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 21 , 2026 | 11:40 PM