JC: సమానత్వాన్ని చాటిన వేమన
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:12 AM
తన పద్యాల ద్వారా సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ (జేసీ) మౌర్యభరద్వాజ్ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
- జేసీ మౌర్యభరద్వాజ్
పుట్టపర్తి టౌన, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తన పద్యాల ద్వారా సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ (జేసీ) మౌర్యభరద్వాజ్ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. జేసీ మాట్లాడుతూ.. వేమన సాహిత్యాన్ని ప్రతిఒక్కరూ అధ్యయనం చేసి ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....