Share News

BUS: బస్‌ షెల్టర్లు లేక అవస్థలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:09 AM

ఆ ప్రయాణికుల అవ స్థలు వర్ణనాతీతం. బస్సుల కోసం ఎండైనా, వాన కురిసినా భరిస్తూ ఎ దురుచూడాల్సి వస్తోంది. ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనం తపురానికి వెళ్లే రహదారిలో ఒక్క బస్‌ షెల్టర్‌ కూడా లేదు. దీంతో ప్ర యాణికులు అవస్థలు పడుతున్నారు.

BUS: బస్‌ షెల్టర్లు లేక అవస్థలు
Commuters waiting in the sun at Chigicherla on the main road

బస్సుల కోసం ఎండలోనే ప్రయాణికుల పడిగాపులు

ధర్మవరం రూరల్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆ ప్రయాణికుల అవ స్థలు వర్ణనాతీతం. బస్సుల కోసం ఎండైనా, వాన కురిసినా భరిస్తూ ఎ దురుచూడాల్సి వస్తోంది. ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనం తపురానికి వెళ్లే రహదారిలో ఒక్క బస్‌ షెల్టర్‌ కూడా లేదు. దీంతో ప్ర యాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి గుండా మండ లంలోని గొల్లపల్లి క్రాస్‌, బడన్నపల్లి క్రాస్‌, గరుడంపల్లి క్రాస్‌, వసంతపు రం, చింతలపల్లి క్రాస్‌, చిగిచెర్ల గ్రామాల ప్రజలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఈ రహదారి గుండా ఆర్టీసీ వారు ధర్మ వరం నుంచి అనంతపురం వరకు రెండు బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా పుట్టపర్తి నుంచి అనంతపురానికి ఓ బస్సు వెళుతుంది. అయితే మండలంలోని గొల్లపల్లి క్రాస్‌ నుంచి చిగిచెర్ల వరకు ఆ దారిలో ఎక్కడా బస్‌ షెల్టర్లు లేవు. దీంతో ఆయా గ్రామాల నుంచి వెళ్లే ప్ర యాణికులు బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తుంటారు. వాన కురిసినా అందులో తడుస్తూనే వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుం వేసవి సమీపి స్తుండటంతో రహదారిలో ఎండసెగకు తీవ్ర ఇబ్బందులు పడతామని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల క్రాస్‌ల వ ద్ద బస్‌షెల్టర్లు ఏర్పాటుచేస్తే తమకు బాధలు తప్పుతాయని అంటు న్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పం దించి బస్‌షెల్టర్‌లను ఏర్పాటుచేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:09 AM