VEMANA: ఘనంగా వేమన జయంతి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:53 PM
యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు.
గాండ్లపెంట, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు. వారికి పర్యాటక శాఖ చైర్మన శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీనబాను, మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవనకుమార్‌రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ క్రిష్ణమూర్తి, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేమన జయంతి సందర్భంగా పలువురు భక్తులు ఆయన సమాధి వద్ద కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మొక్కులు తీర్చుకున్నారు. జయంతి ఉత్సవాలలో ఎందరో ప్రముఖులు ఆశీనులైన సభలో భక్తుల నడుమ మూడేళ్ల చిన్నారి జ్ఞానిక వేమన పద్యాలను వల్లించింది. ఆ చిన్నారని ప్రముఖులు అభినందించారు. జ్ఞానికను, ఆమె తల్లిదండ్రులైన మీనా, కృష్ణకాంతను సత్కరించారు. అలాగే తెలుగు కవుల సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఎమ్మెల్యే కందికుంట సత్కరించారు. అదేవిధంగా ఉత్సవాల ఏర్పాట్ల కోసం పది రోజులుగా చర్యలు చేపట్టిన డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి మునిసిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, గాండ్లపెంట తహసీల్దార్ బాబురావు, ఎంపీడీఓ రామకృష్ణ, పారిశుధ్య కార్మికులను టీడీపీ నాయకుడు దొనుకొండ ఆనంద్ సత్కరించి, వేమన చిత్రప టాలను సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....