Share News

WORKERS: సమస్యలను పరిష్కరించాలని వినతి

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:59 PM

మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

WORKERS: సమస్యలను పరిష్కరించాలని వినతి
Sanitation workers presenting a petition to the Municipal Commissioner

ధర్మవరం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన, పారశుధ్య కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ... మున్సిపాలి టీలో అదనపు కార్మికులుగా 37 మంది, కరోనా కార్మికులుగా 50మంది పనిచేస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు జీత భత్యాలు చెల్లింపులపై, ఆప్కాస్‌ కింద పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుం బంలోని వారికి ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ సమా వేశంలో కౌన్సిలర్లు తీర్మానించారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ కూడా విన్నవించినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వారంలోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు. లేకపోతే ఈ నెల 27వ తేదీ నుంచి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. వినతిపత్రం అందించిన వారిలో పారిశుధ్య కార్మికులు ముకుంద, శ్రీనివాసులు, వెంకటేశ, చెన్నకేశవులు, లక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 19 , 2026 | 11:59 PM