Share News

RECOVERY: ఖర్చు రూ.14 కోట్లు... రికవరీ రూ.88 వేలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:04 AM

జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మం డలపరిధిలోని 14 పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి, తనిఖీ చేశారు. వాటి ఖర్చులు, వివరాలను ప్రజావేదికలో వెల్లడించింది.

RECOVERY: ఖర్చు రూ.14 కోట్లు... రికవరీ రూ.88 వేలు
Officials disclosing details of social inspection

నంబులపూలకుంట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మం డలపరిధిలోని 14 పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి, తనిఖీ చేశారు. వాటి ఖర్చులు, వివరాలను ప్రజావేదికలో వెల్లడించింది. 2024, ఏప్రిల్‌ 1 నుం చి 2025, మార్చి 31 వరకు అలాగే 2025, నవంబరు 27 నుంచి 2026, జనవరి 5 వరకు జరిగిన పనులను సామాజిక తనిఖీ బృందాలు పరిశీ లించారు. రూ.14,68,31,330 ఖర్చు చేయగా, ఇందులో రూ.88,558 రికవ రీ చేసినట్లు పీఓ వెంకటాచలపతి తెలిపారు. ఇందులో పంచాయతీ రా జ్‌కు సంబంధించి రూ.37,398, ఉపాఽధి హామీ పథకం కింద రూ. 51,160 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాము, టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీరాములనాయుడు, అంబుడ్స్‌మెన అధికారి శివారెడ్డి, విజిలెన్స అధికారి నాగేశ్వరరావు, ఎంపీడీఓ పార్థ సారఽథి డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి, ఈసీ శ్రీధర్‌రెడ్డి, గాండ్లపెంట ఏపీఓ చంద్రశేఖర్‌, ఈసీ రమేష్‌, ఉపాఽధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 21 , 2026 | 12:04 AM