Home » Protest
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని, తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్‌తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మిరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆయన ఆరోపించారు.
నేపాల్ యువత ఆగ్రహం ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి. ప్రధాని ఓలి, అధ్యక్షుడి ఇళ్లు ధ్వంసం చేశారు నిరసనకారులు.
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తీసుకున్న సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 347 మందికి పైగా గాయాలయ్యాయి.
రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అందజేశారు. యువత ఆందోళనలపై ప్రధాని అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో హోం మంత్రి తన రాజీనామా అందజేసినట్టు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు.
నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
జస్టిస్ సందీప్ షిండే కమిటీ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు మరో ఆరు నెలలు పొడిగించింది. హైదరాబాద్ గెజిట్‌లోని చారిత్రక రికార్డుల ఆధారంగా మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశాలని కమిటీ పరిశీలిస్తోంది.
మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్‌కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.