Bombay HC Slams Manoj Jarange: షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:33 PM
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
ముంబై: మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జారంగే (Manoj Jarange) నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఓబీసీ కేటగిరిలో మరాఠాలకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ ముంబై ఆజాద్ మైదాన్‌లో గత శుక్రవారం నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మనోజ్ జారంగేపై ముంబై హైకోర్టు (Mumbai High Court) సోమవారంనాడు మండిపడింది. జారంగే సారథ్యంలోని నిరసనలు శాంతియుతంగా లేవని, ఏ షరతుల మీద దీక్షకు అనుమతించామో వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలు నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
మరాఠాలను కుంబీలుగా గుర్తించి ఓబీసీల్లో చేర్చాలని, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు రిజర్వేషన్లు వస్తాయని జారంగే డిమాండ్‌గా ఉంది. తన డిమాండ్ రాజ్యాంగబద్ధమైనదని, కుంబీలు, మరాఠాలు ఒకే సామాజిక వర్గంగా ప్రభుత్వ రికార్డులు కూడా చెబుతున్నాయని ఆయన అంటున్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు అంగీకరించకుంటే మంచినీళ్లు కూడా తాగడం మానేస్తానని తాజాగా ఆయన హెచ్చరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు సాధించేంత వరకూ ముంబై విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాన్ని సవాలు చేస్తూ పిటిషన్.. సుప్రీం కోర్టులో చుక్కెదురు
క్లెయిమ్స్ దాఖలుకు గడువు పొడిగించేది లేదన్న సుప్రీం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..