India vs Pakistan Match: టీవీలు పగులగొట్టి నిరసన తెలిపిన ఆప్ మహిళా కార్యకర్తలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 07:21 PM
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ (India-Pakistan 2025 Asia Cup cricket match)కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. టెలివిజన్లు పగులగొట్టి ఈ గేమ్‌ను బహిష్కరించాలని ప్రజలను కోరారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో తల్లులు, సోదరీమణులు నుదిటి తిలకం కోల్పోయారని ఆప్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. దాంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టారని, పీఓకేను కూడా తిరిగి ఆర్మీ స్వాధీనం చేసుకుని ఉండేదని.. అయితే ఆ సమయంలో మోదీ యూటర్న్ తీసుకున్నారని సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.
'ఇప్పుడు పాకిస్థాన్‌తో ఒక మ్యాచ్ ఆడుతున్నారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్ నడుస్తోంది. బీజేపీ నేతలు, వర్కర్లు దాక్కున్నారు. యావద్దేశం ఈ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నా మ్యాచ్ ఆడబోతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత... రక్తం కాదు, వేడి సింధూరం ప్రవహిస్తోందని మోదీ చెప్పారు. ఇప్పుడు ఆయన చల్లబడినట్టు కనిపిస్తోంది. ఈరోజు తల్లులు, సోదరీమణులు సిందూరంతో వచ్చారు, ఈ సిందూరం పవర్ ఏమిటో యావత్ ప్రపంచం చూస్తుంది' అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి