Share News

Nepal Home Minister Resigns: అట్టుడికిన ఆందోళనలు... నేపాల్ హోం మంత్రి రాజీనామా

ABN , Publish Date - Sep 08 , 2025 | 08:25 PM

రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అందజేశారు. యువత ఆందోళనలపై ప్రధాని అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో హోం మంత్రి తన రాజీనామా అందజేసినట్టు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు.

Nepal Home Minister Resigns: అట్టుడికిన ఆందోళనలు... నేపాల్ హోం మంత్రి రాజీనామా
Nepal protests

కాఠ్‌మాండు: నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనల్లో (Gen-Z protest) కాఠ్‌మాండు సహా వివిధ ప్రాంతాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 347 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ (Ramesh Lekhak) రాజీనామా చేశారు. ఆందోళనల్లో ఊహించలేనంత నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు రావడంతో ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి (KP Sharma Oli)కి అందజేశారు. యువత ఆందోళనలపై ప్రధాని అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో హోం మంత్రి తన రాజీనామా అందజేసినట్టు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. సోషల్ మీడియాపై విధించిన నిషేధం, ప్రభుత్వ అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా వివిధ నగరాల్లో చోటుచేసుకున్న నిరసనలు కాఠ్‌మాండు సహా పలు చోట్లు హింసాత్మకంగా మారాయి.


ప్రధాని రాజీనామాకు ఆర్ఎస్‌పీ డిమాండ్

కాగా, నేపాల్‌ నిరసనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడానికి నైతిక బాధ్యత వహించి ప్రధానమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) డిమాండ్ చేసింది. నిరసనకారులపై అత్యంత పాశవికంగా ప్రభుత్వం విరుచుకుపడటాన్ని ఆర్ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి కబీద్ర బుర్లకోటి ఖండించారు. ప్రభుత్వం ఇంకెంతమాత్రం గద్దెపై ఉండే నైతికత, చట్టబద్ధత కోల్పోయిందన్నారు. తక్షణం నేషనల్ ఎలక్షన్స్ జరపాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

నేపాల్ ప్రధాని హోమ్‌టౌన్‌ను తాకిన నిరసన సెగలు.. రాళ్లు రువ్విన ఆందోళకారులు

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 08:29 PM