Share News

Gen Z Protests In Nepal: నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:49 PM

ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. దాదాపు 100 మంది వరకూ గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. యువత నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Gen Z Protests In Nepal: నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..
Gen Z Protests In Nepal

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యువత ప్రభుత్వంపైకి తిరుగుబాటు చేసింది. సోమవారం ఉదయం కొన్ని వందల మంది యువతీ, యువకులు ఖాట్మాండు వీధుల్లోకి వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. అనంతరం పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. పార్లమెంట్ మెయిన్ గేట్ బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రవేశ ద్వారానికి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా యువత వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రబ్బరు బుల్లెట్లతో వారిపై కాల్పులు జరిపారు.


ఈ కాల్పుల్లో 9 మంది చనిపోగా.. దాదాపు 100 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. యువత నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేలా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. బనేశ్వోర్, లాయిన్ చౌర్‌లతోపాటు పలు సున్నిత ప్రదేశాల్లో కర్ఫ్యూ విధించింది. కాగా, యువత నిరసనలు మొదట శాంతియుతంగానే మొదలయ్యాయి. కొన్ని గంటల తర్వాత హింసాత్మకంగా మారాయి.


అసలేం జరిగిందంటే..

నేపాల్ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆ కొత్త నిబంధనల్ని అన్ని సోషల్ మీడియా యాప్స్‌ ఫాలో కావాలని స్పష్టం చేసింది. ఫాలో కావటంతోపాటు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం కొంత సమయం ఇచ్చింది. అయితే, 26 ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని ఫాలో అవ్వలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, లింక్డ్‌ఇన్,ఫేస్‌బుక్, సిగ్నల్‌తోపాటు మరికొన్నిటిని నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇది అక్కడి జెన్ జీలకు నచ్చలేదు. యాప్స్‌ను బ్యాన్ చేయటంతోపాటు దేశంలో అవినీతి పెరిగిపోయిందంటూ వందల మంది యువతీ, యువకులు నిరసనలకు దిగారు.


ఇవి కూడా చదవండి

కిచెన్‌లో చక్కెర డబ్బాలోకి చీమలు వస్తున్నాయా? ఈ ఇంటి నివారణలు ట్రై చేయండి.!

నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

Updated Date - Sep 08 , 2025 | 06:06 PM