Share News

Kitchen Tips: కిచెన్‌లో చక్కెర డబ్బాలోకి చీమలు వస్తున్నాయా? ఈ ఇంటి నివారణలు ట్రై చేయండి.!

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:10 PM

ఇంట్లోని కిచెన్‌ రూంలో చక్కెర డబ్బాలోకి చీమలు వస్తున్నాయా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..

Kitchen Tips: కిచెన్‌లో చక్కెర డబ్బాలోకి చీమలు వస్తున్నాయా? ఈ ఇంటి నివారణలు ట్రై చేయండి.!
Ants in Sugar

ఇంటర్నెట్ డెస్క్: చక్కెర డబ్బాలోకి చీమలు రావడం సాధారణం. ఇవి ఆరోగ్యానికి హానికరం కాకపోయినా ఇంట్లో ఒక సమస్యగా ఉంటాయి. ఎందుకంటే చీమలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. వాటి సంఖ్య ఎక్కువైతే ఇంటిని అపరిశుభ్రంగా చేస్తాయి. దీంతో వాటిని వదిలించుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


లవంగాలు

చీమలను వదిలించుకోవడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. చెక్కర డబ్బాలో చీమలు పట్టకుండా దానిలో 5-6 లవంగాలను ఉంచండి. లవంగాల బలమైన వాసన చీమలను బయటకు వెళ్లేలా చేస్తుంది.


బే ఆకులు

చీమలు వదిలించుకోవడానికి బే ఆకులు కూడా ఉపయోగపడతాయి. చీమలను నివారించడానికి, మీరు చీమలు ప్రవేశించే చోట, కిటికీల వద్ద, తలుపుల వద్ద బే ఆకులు ఉంచండి. ఆహార పదార్థాలు నిల్వ చేసే చోట బే ఆకులు ఉంచితే వాటి బలమైన వాసనకు చీమలు పారిపోతాయి. అంతేకాకుండా, చెక్కర డబ్బాను కాసేపు సూర్యకాంతిలో ఉంచినా కూడా అందులోని చీమలు బయటకువెళ్తాయి.


ఈ నివారణలు చక్కెర వృధా కాకుండా కాపాడటమే కాకుండా, మళ్ళీ చీమలు రాకుండా చేస్తాయి. లవంగాలు, బే ఆకులు, సూర్యకాంతి వంటి గృహ నివారణలు చీమలను తరిమేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి, ఈ చిట్కాలతో మీరు చక్కెరను సురక్షితంగా ఉంచుకోవచ్చు.


Also Read:

నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

ఉప రాష్ట్రపతి ఎన్నిక మద్దతుపై మేము ముందే చెప్పాం..

For More Latest News

Updated Date - Sep 08 , 2025 | 02:15 PM