Home » Phone tapping
పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
Phone Tapping: చట్టానికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత దేవరాజు గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తన ఇంటిలో అక్రమంగా సోదాలు చేశారని అన్నారు. ఎలక్షన్ టైమ్‌లో తన ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానం వచ్చిందని చెప్పుకొచ్చారు.
మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు సంబంధించి ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు.
SIT Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తరలి వస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్ధల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు గురువారం నోటీసు జారీ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. బల్మూరి వెంకట్ స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ అధికారులు తనను విచారణకు పిలిచారని తెలిపారు.