Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారుల నోటీసులు
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:16 AM
ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది.
హరీశ్ మెడకు ఉచ్చు!
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో హరీశ్‌ను ప్రతివాదిగా చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే నెల 5న దీనిపై విచారణ జరగనుంది. మాజీ మంత్రి హరీశ్ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ చక్రధర్‌గౌడ్ గత ఏడాది డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు హరీశ్, ఆయన పీఏ వంశీకృష్ణ, మరికొందరిపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా.. తాడిపత్రిలో ఏం జరిగిందంటే..
మరికొద్దిసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్