• Home » Peddapalli

Peddapalli

బీజేపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య

బీజేపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య

బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల దాడి హేయమైన చర్య అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆరోపిం చారు. మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దాడిని నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసన వ్యక్తం చేయాలే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్ప డడం సరికాదన్నారు.

రామగుండం నవ నిర్మాణానికి కృషి

రామగుండం నవ నిర్మాణానికి కృషి

రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. వెయ్యి రోజుల ప్రజాపాలన సందర్భంగా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే హాజరుకాగా ఘన స్వాగతం పలికారు

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరు ద్ధరించాలని, ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినం-చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహిం చారు. టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల కూల్చివేతల్లో సైతం వివక్షత పాటిస్తున్నారు. ఉన్న వారికి ఒక తీరుగా లేని వారికి మరో తీరుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కంపోస్టింగ్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

కంపోస్టింగ్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

పెద్దపల్లి మున్సిపల్‌ కార్యా లయంలో రూ.50 లక్షలతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ వద్ద నిర్మించే కంపోస్టింగ్‌ షెడ్‌కు ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమ ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వన మహోత్స వంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు.

 హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు.

ఆధారాలతోనే 22ఏ భూములపై   నిర్ణయాలు తీసుకోవాలి

ఆధారాలతోనే 22ఏ భూములపై నిర్ణయాలు తీసుకోవాలి

22ఏ నిషేధిత భూములకు సం బంధించి పూర్తి ఆధారాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చే సందర్భంలో స్పష్టమైన ఆధారాలు ఉండాలని, అదే విధానాన్ని భూముల తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు.

హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం

హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం

మూడేళ్ళ కాంగ్రెస్‌ పాలనపై ప్రశ్నిస్తున్న రామగుండం పోస్ట ర్‌ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివా రం ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యఅరుణ్‌ కుమార్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది

పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌ అన్నారు. శనివారం రాత్రి అదనపు జిల్లా కోర్టులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో శ్రీనిజ కోహి ర్కర్‌ను ఘనంగా సన్మానించారు.

ప్రశాంతంగా నీట్‌ పీజీ

ప్రశాంతంగా నీట్‌ పీజీ

జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పీజీ 2026 ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 230 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 227 మంది హాజరు కావ డంతో 98.69 శాతం నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి