Share News

గొల్లపల్లిలో లక్క పురుగుల బెడద

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:36 PM

సుల్తానాబాద్‌ పట్టణంలోని గొల్లపల్లి ప్రాంతంలో లక్క పురుగుల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు లక్క పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి మూలంగా ఇండ్లలో ఉండలేని దుస్థితి నెలకొందని, ఆహార పదార్థాల్లో పడడంతో తినలేని పరిస్థితి ఉందని గొల్లపల్లి యాదవనగర్‌ వాసులు అవేదన వ్యక్తం చేస్తు న్నారు.

గొల్లపల్లిలో లక్క పురుగుల బెడద

సుల్తానాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ పట్టణంలోని గొల్లపల్లి ప్రాంతంలో లక్క పురుగుల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు లక్క పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి మూలంగా ఇండ్లలో ఉండలేని దుస్థితి నెలకొందని, ఆహార పదార్థాల్లో పడడంతో తినలేని పరిస్థితి ఉందని గొల్లపల్లి యాదవనగర్‌ వాసులు అవేదన వ్యక్తం చేస్తు న్నారు. రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న పెట్‌ గోదాములకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యం నిల్వచేస్తారు. గోదాముల్లో నిలువ చేస్తున్న బియ్యం వద్ద పురుగులు రాకుండా మం దులు స్ర్పే చేయకపోవడంతో లక్క పురుగులు, ఈగలు ఎక్కువ అయ్యా యని పేర్కొన్నారు. రాత్రి నిద్రపోలేని పరిస్థితి ఉందని, ఆహార పదార్థా లను లక్క పురుగులకు దూరంగా భద్రతపరచ లేకపోతున్నామని పేర్కొన్నారు. లక్క పురుగుల బెడద గురించి ఆదివారం ప్రజలు మున్సి పల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణకు తెలిపారు. దీంతో చైర్మన్‌ రాధాక్రిష్ణ, కౌన్సిలర్‌ ఊట్ల వరప్రదీప్‌ తదితరులు గొల్లపల్లికి చేరుకుని పరిశీలిం చారు. చైర్మన్‌, కౌన్సిలర్‌ ప్రభుత్వ విప్‌ విజయరమణారావుతో ఫోన్‌లో మాట్లాడి లక్క పురుగుల బెడద గురించి వివరించారు. గోదాము నిర్వాహకులు నిర్లక్ష్యంగా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని అన్నారు. వెంటనే గోదాముల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, లక్క పురుగులు రాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యేకు విజ్జప్తి చేశారు.

Updated Date - Jul 19 , 2026 | 11:36 PM