Share News

మెరుగైన వైద్యసేవల కోసమే బస్తీ దవాఖానాలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:43 PM

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తా నాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ఏడవ వార్డు యాదవనగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించనున్న బస్తీ దవాఖానా పనులకు సోమవారం భూమి పూజచేసి ప్రారంభించారు.

మెరుగైన వైద్యసేవల కోసమే బస్తీ దవాఖానాలు

సుల్తానాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తా నాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ఏడవ వార్డు యాదవనగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించనున్న బస్తీ దవాఖానా పనులకు సోమవారం భూమి పూజచేసి ప్రారంభించారు. విజయ రమణారావు మాట్లాడుతు ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవాఖానాలు, పట్టణాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి వంటి ప్రభుత్వ అసుపత్రులలో ఆధునిక వైద్య పరికరాలు నిఫుణులైన డాక్టర్లు ఉన్నారని ప్రజలు ఇక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆరుతడి పంటలు సాగుచేయాలి

ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతుందని, రైతులు జాగ్రత్త గా గమనించాలన్నారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని ముఖ్యంగా పప్పు దినుసులు, ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ఆరుతడి పంటల మూలంగా రైతులకు మేలు జరుగుతుందన్నారు. బావుల్లో నీటి లభ్యతను ఆధారంగా సాగు విస్తీ ర్ణాన్ని నిర్ణయించుకోవాలన్నారు. యూరియాకు బదులు సేంద్రియ ఎరు వులను వాడి దిగుబడులను పెంచు కునే విధంగా రైతులు కృషి చేయాల న్నారు. అలాగే సుల్తానాబాద్‌, సుగ్లాం పల్లి, పూసాల మహిళా సంఘాలకు స్థలాన్ని కేటాయించి భవన నిర్మిస్తాన న్నారు. కౌన్సిలర్‌ ఊట్ల వరప్రదీప్‌ ఆధ్వ ర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధా క్రిష్ణ మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కమిషనర్‌ రమేష్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:43 PM