Share News

న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:38 PM

మంథనిలో న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రజలకు చెప్పా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌ మార్చి నెలలోనే న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చారన్నారు.

న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి

మంథని, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మంథనిలో న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రజలకు చెప్పా లని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌ మార్చి నెలలోనే న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న, ఎన్నో ఏళ్ళు మంత్రిగా పని చేసి 33 నెలల తర్వాత న్యాక్‌ సెం టర్‌ను తీసుకువచ్చి గొప్పలు చెప్పుకోవడం అవమానకరమన్నారు. న్యాక్‌ సెంటర్‌ భవనం ప్రారంభిస్తారా.. లేక అద్దె భవనంలో కొనసాగిస్తారా అనే అంశంపై క్లారిటీ లేదన్నారు. అంగన్‌వాడి సెంటర్లకు కోడిగుడ్లు నిలిపివేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. పెద్దపల్లి-కాటారం రోడ్డు పూర్తి చేయించడానికి నిదులు వెచ్చించలేక పోయారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్‌, మాచీడి రాజుగౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, కనవేన శ్రీనివాస్‌, గొబ్బూరి వంశీ, వేల్పల గట్టయ్య, జంజర్ల శేఖర్‌, పుప్పాల తిరుపతి, మంథని లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:38 PM