Share News

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:45 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్‌ రాజీనామాకు సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. రామగుండం పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ రాష్ట్రంలో 57 శాఖల్లో మొత్తం 70,664 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆధారాలతో సహ చూపిస్తున్నామని, కేటీఆర్‌ నీ మాట మీద నీకు గౌరవం, దమ్ము ఉంటే రాజకీయ సన్యాసం చేయాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు.

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు

అంతర్గాం, జూలై 20(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్‌ రాజీనామాకు సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. రామగుండం పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ రాష్ట్రంలో 57 శాఖల్లో మొత్తం 70,664 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆధారాలతో సహ చూపిస్తున్నామని, కేటీఆర్‌ నీ మాట మీద నీకు గౌరవం, దమ్ము ఉంటే రాజకీయ సన్యాసం చేయాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి పేపర్‌ లీకేజీలు చేశారని, యువకులను రెచ్చగొట్టి వారిని తప్పు దోవ పట్టించి పోలీసు కేసులు అయ్యేలా చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని హితవు పలికారు. నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దన్నారు. కేసీఆర్‌ లక్షల కోట్ల అప్పలు తెచ్చి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్‌ ప్రభు త్వం అద్భుతపాలన సాగిస్తుందన్నారు. సింగరేణిలో బొగ్గు మాయమైందని ప్రచారం చేయడం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు ఒక్కటేనని, దొంగ చాటు వ్యవహారం అందరికి తెలుసునన్నారు. నూతన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రస్థాపనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదిస్తే, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్లాంట్‌ ఎందుకని మాట్లాడటం విడ్డూరంగా ఉంద న్నారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్న దని, రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా జవాబు చెబుతారన్నారు. నీరు, బొగ్గులేని యాదాద్రిలో 30 వేల కోట్లతో నిర్మించాల్సిన విద్యుత్‌ ప్లాంట్‌ను 60 వేల కోట్లకు పెంచి 4 వేల మెగావాట్ల ప్లాంటును నిర్మించిందని, దీని వల్ల ఎవరికి లాభం చేకూరిందో ప్రజలందరికి తెలుసునని, రామగుండంలో అన్ని వనరులున్నా ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు దీటి బాలరాజు, బొంతల రాజేష్‌, కార్పొరేటర్లు ఇస్సాంపల్లి అంజులు, దారంగుల కుమార్‌, నెలకంటి రాము, కాంగ్రెస్‌ నాయకులు వాజీద్‌ ఖాన్‌, బాధవత్‌ సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:45 PM