Share News

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందాం

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:25 PM

ఎల్‌నినో పరి స్థితులను ఎదుర్కొవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్‌ అన్నారు. మంగళవారం సర్‌ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందాం

ధర్మారం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరి స్థితులను ఎదుర్కొవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్‌ అన్నారు. మంగళవారం సర్‌ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. ఎల్‌నినో పరిస్థితులపై మేడారం రైతు వేదిక లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటను సాగు చేయాలని తెలిపారు. పైడిచింతలపల్లి, దొంగతుర్తి, రచ్చపల్లి గ్రామాల్లో నిర్వహించిన సర్‌ కార్యక్రమాల్లో పలు సూచనలు చేశారు. మేడారం గ్రామంలో మూడు ఇంది రమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మరణించిన మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 8 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం లో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరచిపోయారు

బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు మరచిపోయారని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉం డగా ఎంత మంది రైతులను ఆదుకున్నారని, ఎంత మందిని పరామర్శించారని కేటీఆర్‌ రైతు సదస్సుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కొండగుట్టు బస్సు ప్రమాదంలో 63 మంది చనిపోతే కేసీఆర్‌ ఎందుకు పరామర్శించ లేదని విమర్శించారు. సకాలంలో వర్షాలు లేక తెలంగాణ రైతులు విపత్కర పరిస్థితుల్లో ఉంటే, దేవుడుకి దండం పెట్టుకోవాల్సింది పోయి, కబడ్డి ఆడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఉద్దేశించి అన్నారు. వారు కట్టిన కాళేశ్వరం ద్వారా ధర్మపురి నియోజకవర్గానికి చుక్కనీరు రాదని, అంతా దొరల ప్రాంతానికే నీళ్లు వెళ్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 11:25 PM