బహుజనులంతా సంఘటితం కావాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:43 PM
బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 80 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా పాలకులు చేస్తున్నారన్నారు.
పెద్దపల్లి టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 80 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు సరిగా అందకుండా పాలకులు చేస్తున్నారన్నారు. ఛత్రపతి సాహు మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా బహుజన సేన ఆద్వర్యంలో హైదారాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే సదస్సు విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. నోమూరి శ్రీధర్, నూనె కుమార్, ఆసం తిరుపతి, కట్కూరి సందీప్, గద్దల శంకర్, సంకెనపల్లి లక్ష్మణ్, బి. లక్ష్మణ్, లింగంపల్లి శంకర్, రాగమల్ల మధుకర్, దొడ్ల రమేష్, కోల శ్రీనివాస్, నల్లవెల్లి శంకర్, కంకటి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.